TS News: స్థానికులకే మద్యం దుకాణాలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఈరోజు నుంచే నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌శాఖ మంత్రి

Updated : 09 Nov 2021 19:11 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఈరోజు నుంచే నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్‌ కల్పించామని మంత్రి పేర్కొన్నారు. కులవృత్తి రీత్యా గౌడ కులస్తులకు ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయమని మంత్రి తెలిపారు. వందశాతం లాభాలతో నడిచే వ్యాపారమైన మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా స్థానికులకు లాభాలు చేకూరే విధంగా మద్యం పాలసీని రూపొందించినట్టు వివరించారు. మద్యం పాలసీపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మట్లాడారు. గతంలో కల్తీ, విదేశీ మద్యం అమ్మేవారని, ఇప్పుడు ఆ పరిస్థితిలేదని చెప్పారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్టు కూడా ఉపయోగిస్తామని మంత్రి తెలిపారు. గంజాయి అమ్మేవారి వివరాలు చెప్పిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 18వరకు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని