Casino case: క్యాసినో కేసు.. మంత్రి తలసాని పీఏని 7గంటల పాటు విచారించిన ఈడీ

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) హరీశ్‌, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు.

Published : 22 Nov 2022 01:17 IST

హైదరాబాద్‌: క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) హరీశ్‌, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బ్యాంకు ఖాతాల వివరాలు కోరగా.. వారు సవివరంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

సుమారు 7 గంటల పాటు తలసాని పీఏ హరీశ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. షాపూర్‌లో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న బుచ్చిరెడ్డి సైతం తన బ్యాంకు లావాదేవీల వివరాలతో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆరేళ్ల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వివరాలను ఈడీ అధికారులు కోరినట్లు విచారణ అనంతరం బుచ్చిరెడ్డి తెలిపారు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోలో తనకు 5 శాతం వాటా ఉందని.. ఈ ఏడాది జనవరిలో అక్కడకు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ డబ్బు గెలుచుకున్నా లావాదేవీలన్నీ స్వదేశం నుంచే జరుగుతాయని బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి, తలసాని మహేశ్‌, ధర్మేంద్ర యాదవ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని