Talasani: తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు: మంత్రి తలసాని

ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. 

Updated : 23 Dec 2022 15:25 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఫిల్మ్‌నగర్‌లో కైకాల పార్థివదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. 

‘‘నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. దాదాపు 700 చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ఆయన మరణం సమాజానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మచిలీపట్నం ఎంపీగానూ కైకాల సేవలందించారు. ఎన్టీఆర్‌ సైతం సత్యనారాయణ నటనను ఇష్టపడేవారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటుల చిత్రాల్లో తప్పనిసరిగా కైకాల ఉండేవారు. ఏ పాత్ర పోషించినా అందులో లీనమైపోయేవారు. అలాంటి గొప్పవ్యక్తి మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు కైకాల పార్థివదేహాన్ని మహా ప్రస్థానానికి తరలిస్తాం. ప్రభుత్వపరంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం’’ అని తలసాని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు