Andhra News: వైద్యారోగ్య శాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించం: మంత్రి రజిని

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయి వరకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందని అందుకు అనుగుణంగానే సేవలు అందించాల్సి ఉంటుందని మంత్రి...

Published : 09 May 2022 22:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయి వరకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందని అందుకు అనుగుణంగానే సేవలు అందించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖపై జిల్లాల డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో మందుల లభ్యత, అంబులెన్సుల కొరతపై మీడియాలో కథనాలు వచ్చాయని.. అలాంటి చిన్న చిన్న ఘటనలు కూడా రోగులపై తీవ్రప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఒక్కరు తప్పు చేసినా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టేనని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులను తనిఖీ చేస్తానని మంత్రి వెల్లడించారు. కొవిడ్ మహమ్మారిని అడ్డుకోవటంలో వైద్యారోగ్య శాఖ సమర్థంగా పనిచేసిందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల కారణంగా కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. వైద్యారోగ్య శాఖలో చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని