Ap news: సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్‌

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ  సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్,

Updated : 05 Aug 2021 18:56 IST

మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ

అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ  సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ముఖ్య అధికారులు ఆరుగురు హాజరయ్యారు. వంద సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందని మంత్రులు అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమగ్ర సర్వే కోసం 13,371 మంది పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. రీ సర్వేతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని