AP News: ఉద్యోగ సంఘాల రాకకోసం మంత్రుల నిరీక్షణ

పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూస్తున్నారు

Updated : 24 Jan 2022 15:30 IST

అమరావతి: పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూస్తున్నారు. సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి నిరీక్షిస్తున్నారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు పిలుపునివ్వగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పినా మంత్రులు నిరీక్షించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని