Ts News: ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు

తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. ..

Updated : 24 Sep 2022 17:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. శనివారం కొన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. ఇవాళ మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను మరోసారి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రస్తుతం ఎంత మంది ఒప్పంద, పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్నారనే వివరాలను హరీశ్‌రావు పరిశీలిస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న మంత్రివర్గ సమావేశానికి ఖాళీలకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్‌కు నివేదిక సమర్పించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని