Telangana News: దేశీయ మిర్చికి రికార్డు ధర.. ఎంత పలికిందంటే?

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో ఎర్రబంగారం మిర్చి, తెల్ల బంగారం పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 

Updated : 04 Apr 2022 10:46 IST

ఎనుమాముల మార్కెట్‌: వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో ఎర్రబంగారం మిర్చి, తెల్ల బంగారం పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశీయ మిర్చి రకం క్వింటాల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.55,551 పలికింది. ములుగు జిల్లాకు చెందిన రైతు రాజేశ్వరరావు గతవారం తెచ్చిన మిర్చికి అత్యధికంగా రూ.52వేల ధర పలకగా..  ఇవాళ రైతు కిషన్‌రావు తెచ్చిన మిర్చి రూ.55,551 రికార్డు ధర సొంతం చేసుకుంది.

మిర్చికి అధిక ధర నమోదు కావడంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామర పురుగు కారణంగా దిగుబడి తగ్గిందని అయితే ధర ఎక్కువ పలకడం కాస్త ఊరట కలిగిస్తోందని చెబుతున్నారు. గత నెల 3న తొలిసారి క్వింటాల్ దేశీయ మిర్చి ధర రూ.32 వేలు పలకగా.. ఇవాళ రూ.55,551 పలకడం గమనార్హం. మరో వైపు క్వింటాల్‌ పత్తి ధర రూ.12,110 పలికింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని