Mask must: రోడ్డుపై కారు ఆపి మాస్కులు పంచిపెట్టిన సీఎం.. వీడియో

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.....

Updated : 05 Jan 2022 04:50 IST

చెన్నై:  తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఆయన తాజాగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దేశంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో చెన్నై వీధుల్లో తన కాన్వాయ్‌ని ఆపి మాస్కుల్లేకుండా తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి మాస్కులు పంచి పెట్టారు. ఈ వీడియోని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. హెడ్‌ క్వార్డర్స్‌ నుంచి క్యాంప్‌ ఆఫీస్‌కు వస్తున్న దారిలో కొందరు మాస్కుల్లేకుండా బహిరంగంగా తిరగడం గమనించానన్న స్టాలిన్‌.. వారికి మాస్కులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యాక్సిన్‌ వేయించుకోవడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని