MLC Election: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది.

Updated : 27 Feb 2023 22:10 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ (AP) లో 7 స్థానాలకు, తెలంగాణ (Telangana)లో 3 మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

తెలంగాణలో నవీన్‌ రావు, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఏపీలో నారా లోకేశ్‌, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్య నారాయణ పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవనున్న ఈ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

* నోటిఫికేషన్‌ : మార్చి 6

* నామినేషన్ల స్వీకరణ : మార్చి 13 వరకు

* నామినేషన్ల పరిశీలన : మార్చి 14

* పోలింగ్‌, కౌంటింగ్‌ : మార్చి 23

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని