MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎరకేసు.. అనిశాతోనే దర్యాప్తు చేయాలి కదా..!
ఎమ్మెల్యేకు ఎరకేసుపై భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భాజపా, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ (CBI) లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ నిందితులు, భాజపా (BJP) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు (HighCourt) ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గురించి భాజపా తరఫు న్యాయవాది ప్రస్తావిస్తూ...అక్కడి వివరాలను కోర్టుకు వివరించారు. కీలకమైన కేసు దర్యాప్తు దశలో ఉంటే వివరాలెలా బయటకి వెళ్లాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు శాంతిభద్రతల విభాగంతో ఎలా దర్యాప్తు చేయిస్తున్నారని వాదించారు. ఆ కేసులను అనిశాతోనే విచారణ జరిపించాలన్న నిబంధన ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన్ 17బీ ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి కూడా దర్యాప్తు చేయొచ్చని అడ్వొకేట్ జనరల్ వాదించారు. కేసు విషయాలు బయటకి పొక్కుతున్నాయని, అందుకే రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. పిటిషనర్ల అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ ముగించింది. మధ్యంతర పిటిషన్లలో ఏమైనా అభ్యంతరాలుంటే రేపు చెప్పాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ తీర్పును వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్