MLAs Bribery Case: బీఎల్ సంతోష్‌కు మెయిల్‌ ద్వారా నోటీసులివ్వండి: సిట్‌ అధికారులకు హైకోర్టు ఆదేశాలు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సిట్‌ విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సంతోష్‌కు మరోసారి 41సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయాలని సిట్‌ అధికారులను అదేశించింది.

Updated : 23 Nov 2022 16:00 IST

హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ సిట్‌ విచారణకు హాజరకాకపోవడంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు వినిపిస్తూ.. బీఎల్‌ సంతోష్‌ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కోరారు. 20వ తేదీనే నోటీసులు అందినప్పటికీ విచారణకు హాజరుకాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నిర్దేశించిన తేదీతో కూడిన మరో 41ఏ సీఆర్‌పీసీ నోటీసు జారీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం..  సంతోష్ విచారణకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉందని పేర్కొంది. సంతోష్‌కు మరోసారి 41సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయాలని అదేశించింది. అయితే, ఈసారి ఈమెయిల్ ద్వారా నోటీసులు జారీ చేయాలని సిట్‌ అధికారులను ఆదేశించింది.

సంతోష్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఏజీ కోరారు. సంతోష్‌ సిట్‌ విచారణకు హాజరుకాలేకపోయినందునే స్టే ఎత్తివేయాలని కోరుతున్నట్లు ఏజీ పేర్కొన్నారు. ఏజీ వినతిని హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 29న కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించిన ధర్మాసనం.. ఈ నెల 30 మరోసారి వాదనలు విననున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని