MLC Ananta babu: కాకినాడ జీజీహెచ్‌కు ఎమ్మెల్సీ అనంతబాబు

మాజీ డ్రైవర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Updated : 23 May 2022 20:04 IST

కాకినాడ: మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఏఆర్‌ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నారు. ఉదయం నుంచి అనంతబాబు అరెస్టుపై ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అనంతబాబు(Ananthababu) స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం నుంచి అనంతబాబును విచారించారు. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచిన తర్వాత అనంతబాబును రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని