MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

Updated : 02 Apr 2023 14:57 IST

హైదరాబాద్: దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. మోస పూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భాజపా, ప్రధాని మోదీపై ఆమె విమర్శలు గుప్పించారు. 

కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోదీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా ట్వీట్‌ చేశారు.

కాగా.. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం అన్నారు. మోదీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని