రాఖీ పంపిన మహిళకు మోదీ ధన్యవాదాలు

ఇటీవల రక్షాబంధన్‌ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఓ మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ రాసిన లేఖకు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి.

Published : 13 Sep 2020 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల రక్షాబంధన్‌ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఓ మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ రాసిన లేఖకు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు చెందిన దీపా మటేలా జులై 28న స్పీడ్‌పోస్ట్‌ ద్వారా ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌కు ప్రత్యేకంగా రాఖీలు పంపారు. దీనికి ఆనందం వ్యక్తం చేసిన మోదీ సోదరభావంతో ప్రేమను పంచుకున్న దీపా మటేలాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఓ సందేశం కూడా రాశారు. అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు రక్షగా ఉండాలని తెలిపే భారత సంస్కృతి ఎంతో గొప్పదన్న ఆయన రక్షాబంధన్‌ పండుగ మన మధ్య ఆప్యాయతను పెంచుతోందని అన్నారు. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండాలని కరోనా మనకు నేర్పుతోందని మోదీ ఈ లేఖలో సందేశం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని