HCA: మా తప్పులేదు.. లోపాల్ని సవరించుకుంటాం: అజారుద్దీన్‌

భారత్‌ -ఆసీస్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జింఖానా మైదానంలో తోపులాట జరగడం దురదృష్టకరమని..

Updated : 22 Sep 2022 17:53 IST

హైదరాబాద్‌: భారత్‌ -ఆసీస్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జింఖానా మైదానంలో తోపులాట జరగడం దురదృష్టకరమని.. ఇందులో తమ తప్పు ఏమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. అసలేం జరిగిందనే అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. టికెట్ల వివరాలు రేపు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. మ్యాచ్‌ నిర్వహణ అంటే అంత తేలిక కాదన్నారు. జింఖానా మైదానంలో జరిగిన తోపులాట నేపథ్యంలో క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం అజారుద్దీన్‌ మాట్లాడారు. ‘‘హెచ్‌సీఏలో లోపాలను సవరించుకుంటాం. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రం.. అలాంటి తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు ఉంటాయి. మ్యాచ్‌ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నది. కూర్చొని మాట్లాడుకొనేంత సులభం కాదు. ఈరోజు నేనున్నా.. రేపు మరొకరు ఉంటారు.. అందరి  ఆలోచన ఒక్కటే. తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడింపజేయడమే లక్ష్యం’’ అని తెలిపారు.

‘‘చాలా ఏళ్ల తరువాత మ్యాచ్‌ నిర్వహించుకొనే అవకాశం వచ్చింది. దీంతో అందరూ సంతోషంగా ఉన్నారు. మ్యాచ్‌ నిర్వహణను ఎప్పుడూ నెగెటివ్‌ కోణంలో చూడొద్దు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని