France: తల్లి నిద్రపోతోందనుకొని.. మృతదేహంతో రోజులకొద్దీ గడిపిన చిన్నారులు
అభంశుభం తెలియని ఆ చిన్నారులకు ఏం తెలుసు తమ తల్లి చనిపోయిందని.. ఆ పాలుగారే బుగ్గలకు ఏం తెలుసు తమ మాతృమూర్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.....
రెన్నాస్: అభంశుభం తెలియని ఆ చిన్నారులకు ఏం తెలుసు తమ తల్లి చనిపోయిందని.. ఆ పాలుగారే బుగ్గలకు ఏం తెలుసు తమ మాతృమూర్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.. నిద్రపోతోందని భావించారు. తిరిగి తమను ఒడిలోకి తీసుకొని లాలిస్తుందని ఆశించారు. అలా గంటలు కాదు.. రోజులపాటు వేచిచూశారు. ఈ హృదయవిదారక ఘటన ప్రాన్స్‌లో చోటు చేసుకుంది. అనుకోని కారణాలతో మరణించిన తల్లి మృతదేహం వద్దే ఆ చిన్నారులు రోజుల కొద్దీ గడిపారు. నిద్రపోతోందని భావించారు. అల్లరిచేస్తే ఆమెకు ఎక్కడ మెలుకువ వస్తుందోనని నిశ్శబ్దంగానే ఉన్నారు.
వాయువ్య ఫ్రాన్స్‌లోని లేమాన్స్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు సంతానంతో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా మృతిచెందారు. అయితే ఆమె ఐదు, ఏడేళ్ల కుమార్తెలు మాత్రం తల్లి మరణించినట్లు తెలుసుకోలేకపోయారు. ఆమె నిద్రపోతోందని భావించారు. అయితే కొద్దిరోజులుగా సదరు బాలికలు పాఠశాలకు వెళ్లకపోవడంతో వారి తల్లికి సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం పోలీసులు వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టగా బయటకు వచ్చిన చిన్నారులు ‘నిశ్శబ్దంగా ఉండండి. మమ్మీ నిద్రపోతోంది’ అని పోలీసులతో అనడం గమనార్హం. లోపలికి వెళ్లి చూడగా మహిళ మృతిచెంది దుర్వాసన వస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమెది సహజ మరణంగానే తేలినట్లు వెల్లడించారు. బాలికలను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్ అందిస్తున్నారు. అయితే ఆ మహిళ మృతిచెంది ఎన్న రోజులు అవుతుందో స్పష్టంగా తెలియలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్‌కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ.. వాట్సప్‌లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి