Monkey: హత్య కేసులో సాక్ష్యాలు కోతి దొంగిలించిందట...

సాధారణంగా కోర్టులో ఏదైనా కేసుకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో అవి తారుమారు అయ్యాయనో, తప్పుడు సాక్ష్యాలనో వింటుంటాం.

Published : 07 May 2022 01:28 IST

జైపుర్‌: సాధారణంగా కోర్టులో ఏదైనా కేసుకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో అవి తారుమారు అయ్యాయనో, తప్పుడు సాక్ష్యాలనో వింటుంటాం. కానీ, రాజస్థాన్‌లో ఓ పోలీసు చెప్పిన విచిత్రమైన వివరణ విని అంతా నివ్వెరపోయారు. ఓ హత్యకు సంబంధించిన సాక్ష్యాలన్నీ సంచిలో పెట్టి చెట్టు కింద పెడితే కోతి దొంగిలించిందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన కోర్టు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు అతనిని సస్పెండ్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని చాంధ్వాజీలో నివాసముండే శశికాంత్‌ శర్మ అనే వ్యక్తిని కొందరు హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మృతదేహం వద్ద ఉన్న కత్తి, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదురోజుల తర్వాత నిందితులను అరెస్టు చేశారు.

వారిని జిల్లా అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు సాక్ష్యాలు అడగ్గా ‘హత్యకు ఉపయోగించిన ఆయుధంతో సహా అన్ని ఆధారాలు ఉన్న సంచిని పోలీస్‌స్టేషన్‌లోని చెట్టు కింద ఉంచానని, ఓ కోతి వాటిని దొంగిలించుకు పోయిందని’ చెప్పారు. అంతేకాకుండా కోతి సాక్ష్యాలను తీసుకున్నట్లు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసి కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని