Monkeypox: విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం

విజయవాడలో మంకీ ఫాక్స్‌ కలకలం రేగింది. చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు

Updated : 17 Jul 2022 13:56 IST

విజయవాడ: విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.

విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు. ఈ సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని