Monsoon: నైరుతి మరో రెండు రోజుల ఆలస్యం

నైరుతి రుతు పవనాలు మరో రెండు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్‌ 3న ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక తీరంలో......

Updated : 27 Feb 2024 15:55 IST

దిల్లీ: నైరుతి రుతు పవనాలు మరో రెండు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్‌ 3న ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక తీరంలో ఉపరితల ఆవర్తనం  కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం మొహాపాత్ర వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నుంచి మరింత బలపడతాయని, దీంతో కేరళలో వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్‌ 3న ఇవి కేరళను తాకుతాయని చెప్పారు. వాస్తవానికి జూన్‌ 1నే కేరళ తీరాన్ని రుతు పవనాలు తాకుతాయని గతంలో ఐఎండీ వెల్లడించింది. ఈ సారి దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించాక నాలుగు నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని