Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 14 May 2021 08:59 IST

1. పడక ఉంటేనే రండి

కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే బాధితులు ముందుగా ఇక్కడి ఆసుపత్రుల్లో పడక రిజర్వు చేసుకుని, అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Covid Vaccine: నెలాఖరు వరకు రెండో డోసే 

2. AP: 300 టన్నుల Oxygen ప్లాంటు

‘రాష్ట్రంలో 300 టన్నుల సామర్థ్యంతో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులోనూ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. కృష్ణపట్నం, కడప ప్రతిపాదిత స్టీల్‌ప్లాంట్ల అవసరాలు తీర్చడంతో పాటు రోగులకు ఉపయోగపడేలా ఈ ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మించేందుకు యోచించాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలి 

3. పీఎం కిసాన్‌ సాయం నేడు ఖాతాల్లో జమ

పీఎం కిసాన్‌ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నారు. 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19,000 కోట్లు అందనున్నాయి. ఇవి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకానికి సంబంధించిన 8వ విడత నిధులుగా ప్రధానమంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని.. ఇప్పటివరకు రూ.1.15 లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.

4. Vaccine: త్వరలో కొత్త టీకాలు

దేశంలో కరోనా టీకాల లభ్యతను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలోనే కొత్త టీకాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొత్తంగా 200 కోట్లకు పైగా డోసులను సముపార్జించుకోనున్నట్లు తెలిపింది.  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ వచ్చే వారమే మన దగ్గర విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. Corona: కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు

కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం, తీవ్రత పెరిగాయి. చికిత్స విధానాల్లోనూ మార్పులు అనివార్యమయ్యాయి. కొవిడ్‌ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లు మోతాదు మించినా, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధ పడుతున్నా.. మరో ముప్పు పొంచి ఉంది. అదే మ్యుకర్‌మైకోసిస్‌! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కొవాగ్జిన్‌ తయారీ అందరికీ సాధ్యం కాదు

కొవాగ్జిన్‌ టీకా తయారీ కోసం.. దాని సాంకేతికతను వేరేవారికి బదిలీ చేయాలని కొందరు అడుగుతున్నట్లు వీకే పాల్‌ తెలిపారు. అయితే- దాన్ని తయారుచేయడం ఇతరులకు అంత సులభం కాదన్నారు. ‘‘కొవాగ్జిన్‌ సాంకేతికతను బదిలీ చేయడానికి భారత్‌ బయోటెక్‌ సిద్ధంగా ఉంది. ఇందుకు ఎవరైనా ముందుకొస్తే స్వాగతిస్తామని మాతో వారు చెప్పారు’’అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

* కొవిషీల్డ్‌ రెండో డోసుకు 12-16 వారాల గడువు 

7. కుటుంబ పత్రం..రాసి పెట్టుకున్నారా?

రెండో దశలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు  తమ పెద్ద దిక్కును కోల్పోయాయి. లక్షల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరోపక్క.. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పుడు.. ముఖ్యమైన బ్యాంకు ఖాతాల వివరాలు, బీమా పాలసీల పత్రాలు ఎక్కడున్నాయో తెలియక చిక్కుల్లో పడుతున్న కుటుంబ సభ్యులూ ఉన్నారు. అందుకే, ప్రతి పెట్టుబడి.. పాలసీ.. బ్యాంకు ఖాతా.. వీటన్నింటితో ఒక జాబితా సిద్ధం చేసి పెట్టుకోవడం ఎప్పుడూ అవసరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయడి 

* ఆసుపత్రిలో చేరకున్నా.. పరిహారం...

8. పొవార్‌కే ఆ పదవి

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ రమేష్‌ పొవార్‌ తిరిగి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూవీ రామన్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న అతను.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించనుండడం విశేషం. కొత్తగా కోచ్‌ పదవి కోసం రామన్‌తో సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులకు ముఖాముఖీ నిర్వహించిన మదన్‌ లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) 42 ఏళ్ల పొవార్‌ పేరును ప్రతిపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* PV Sindhu అకాడమీకి విశాఖలో రెండు ఎకరాలు

9. నేపాల్‌ ప్రధానిగా ఓలి పునర్నియామకం

నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేసిన విపక్షాలు చివరకు ఇక తమవల్ల కాదంటూ గురువారం చేతులు ఎత్తేయడంతో.. గత సోమవారం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తాజా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి (69)కే రాష్ట్రపతి మరో అవకాశం ఇచ్చారు. 271 స్థానాలున్న పార్లమెంటులో ఓలి సారథ్యంలోని నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్సీపీ)కి 121 మంది సభ్యుల బలముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రాజీ యత్నాలు.. రాకెట్‌ దాడులు

ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య సంధి కుదుర్చేందుకు ఈజిప్ట్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం చివరి రోజైన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నాడు కూడా పరస్పర దాడులు కొనసాగాయి. దీంతో పాలస్తీనాలో పండగా వాతావరణమే కనిపించలేదు. హమాస్‌ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపైకి సంధించగా....గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని