
వాలంటైన్ వీక్లో ప్రేమికులు ఎక్కడికి వెళ్లారంటే!
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికుల దినోత్సవం ముగిసింది. ఫిబ్రవరి 8న ప్రేమికులకు వాలంటైన్ వారం మొదలు కాగా.. వారి వారి ఇష్టాలను బట్టి వేడుకలు చేసుకున్నారు. ఈ వారం రోజుల్లో చాలా మంది ప్రేమికులు విహారయాత్ర నిమిత్తం వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా ఈ ఏడాది వాలంటైన్ వీక్ (ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 15)లో ప్రేమికులు న్యూదిల్లీ, గోవా, ముంబయి, జయపుర, బెంగళూరు నగరాలకు ఎక్కువగా వెళ్లారని, అక్కడి నుంచి సందర్శక ప్రాంతాలకు చేరుకున్నారని డిజిటల్ ట్రావెల్ వెబ్సైట్ బుకింగ్.కామ్ వెల్లడించింది. ప్రేమికులు బుక్ చేసుకున్న టికెట్లు, హోటళ్లు, బస చేసిన తేదీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారట.
ఏటా పలు ట్రావెల్ వెబ్సైట్లు, ఇతర వెబ్సైట్లు ప్రేమికుల కోసం ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేస్తాయి. ఎక్కువగా కర్ణాటకలోని దేవనహల్లి, హంపి, చిక్మగలూర్, మైసూర్.. రాజస్థాన్లో జోధ్పూర్, నిమ్రానా.. గోవాలోని క్యాండోలిమ్, కోలా.. పుదుచ్చేరి ప్రాంతాలను ప్రేమికులకు రొమాంటిక్ డిస్టినేషన్స్గా సిఫార్సు చేస్తుంటాయి.