ప్లానెట్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా ఛైర్మన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ‘ప్లానెట్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఛైర్మన్‌ వినయ్‌ రామ్‌ నిడదవోలుకి లభించింది.

Updated : 28 Jan 2023 17:40 IST

ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డ్స్‌ థర్డ్‌ ఎడిషన్‌లో భాగంగా ‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ‘ప్లానెట్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’, ‘వేద భారత్‌ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఛైర్మన్‌ వినయ్‌ రామ్‌ నిడదవోలుకి లభించింది. దిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 25న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికిపైగా ఎకరాల్లో దేశీయ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు గాను ఈ అవార్డు ఆయనకు వరించింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు