అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలేవో తెలుసా?
వర్షాకాలం మొదలుకాబోతుంది. రుతుపవనాల గమనాన్ని బట్టి.. వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు.. మోస్తారు వానలు.. భారీ వర్షాలు కురుస్తాయి. మన దేశంలో సుమారుగా ఏటా వెయ్యి మిల్లీమీటర్ల నుంచి 1,200 మి.మీ వరకు వార్షిక వర్షపాతం నమోదవుతుందట. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా వర్షాలు పడుతూ..
వర్షాకాలం మొదలైంది. రుతుపవనాల గమనాన్ని బట్టి.. వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు.. మోస్తారు వానలు.. భారీ వర్షాలు కురుస్తాయి. మన దేశంలో ఏటా సగటున 1000 నుంచి 1,200 మిల్లీ మీటర్ల వరకు వార్షిక వర్షపాతం నమోదవుతుందట. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా వర్షాలు పడుతూ.. అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా అత్యధిక వర్షపాతం నమోదవుతోన్న ప్రాంతాలేవో తెలుసుకుందామా?
మాసిన్రామ్ - 11,871మి.మీ
మాసిన్రామ్.. భారతదేశంలోని మేఘాలయా రాష్ట్రంలోని తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలోని పట్టణం. షిల్లాంగ్‌కు 60.9కి.మీ దూరంలో, సముద్రమట్టానికి 1,400మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇక్కడ ఏటా సగటున 11,871మి.మీ వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది. 1985లో నమోదైన 26వేల మి.మీ వర్షపాతం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
చిరపుంజీ - 11,777మి.మీ
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేస్తోన్న రెండో ప్రాంతం కూడా మేఘాలయాలోనే ఉంది. మాసిన్రామ్‌కు పది మైళ్ల దూరంలో ఉన్న చిరపుంజీలోనూ దాదాపు ఎనిమిది నెలలు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటుంది. అందుకే ఇక్కడ సగటున వార్షిక వర్షపాతం 11,777మి.మీ నమోదవుతోంది. ఈ ప్రాంతంలో జలపాతాలు.. చెట్ల వేర్లతో అల్లిన వంతెనలు, కొండలు బాగా ఆకట్టుకుంటాయి.
టుటెండో - 11,770 మి.మీ
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉన్న టుటెండో అంత ప్రముఖ ప్రాంతమేమీ కాదు. ఇక్కడి ప్రజలు చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. నిత్యం వర్షం కురుస్తుండటంతో వారి ఇళ్లపై వాటర్‌ప్రూఫ్ షీట్లను కప్పి ఉంచుకుంటారు. ఇక్కడ వార్షిక వర్షపాతం సగటున 11,770 మి.మీ. ఈ ప్రాంతానికి సమీపంలోని క్విబ్డో పట్టణంలో కూడా వర్షపాతం భారీగానే ఉంటుంది.
క్రోప్ రివర్ - 11,516 మి.మీ
న్యూజిలాండ్‌లోని 9 కిలోమీటర్ల పొడవున్న క్రోప్ రివర్ నది పరిసర ప్రాంతాల్లో నిత్యం భారీగా వర్షాలు పడుతుంటాయి. దీంతో ఏడాదిలో సగటున 11,516 మి.మీ వర్షపాతం నమోదవుతోంది.
శాన్ ఆంటోనియా డి యూరెకా - 10,450మి.మీ
ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం శాన్ ఆంటోనియా డి యూరెకా. ఈక్విటోరియల్ గినియాలోని బయోకో ఐలాండ్‌లో ఉన్న ఈ ప్రాంతంలో ఏడాదిలో ఏడు నెలలు వర్షం పడుతూనే ఉంటుంది. కేవలం నవంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే కాస్త తెరిపి ఇస్తుంది. ఈ సమయంలో అక్కడి ప్రకృతి అందాలు చూసేందుకు పర్యటకులు వెళ్తుంటారు. మొత్తంగా శాన్ ఆంటోనియా డి యూరెకాలో ఏటా సగటున 10,450మి.మీ వర్షపాతం ఉంటుంది.
దెబాండ్షా - 10,299మి.మీ
ఆఫ్రికాలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన మౌంట్ కామెరూన్ వద్ద ఉండే దెబాండ్షా గ్రామంపై వరుణుడి ప్రభావం విపరీతంగా ఉంటుంది. మేఘాలను పర్వతం అడ్డుకుంటుండటంతో పర్వతాన్ని దాటలేక మేఘాలు ఈ గ్రామంపై వర్షం కురుపిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. కాగా.. ఏటా ఈ ప్రాంతంలో నమోదయ్యే వర్షపాతం 10,299మి.మీ.
బిగ్ బోగ్, హవాయి - 10,272మి.మీ
హవాయిలో రెండో అతిపెద్ద ఐలాండ్ మౌయి. ఇక్కడ ఉన్న బిగ్‌బోగ్ ప్రాంతంలో ఏటా నమోదయ్యే సగటు వర్షపాతం 10,272మి.మీగా ఉంటోంది. నిత్యం వర్షం కురుస్తున్నప్పటికీ ఇక్కడి జలపాతాలు, ప్రకృతి అందాలు చూసేందుకు సందర్శకులు వస్తుండటం విశేషం.
మౌంట్ వైయలేల్ - 9,763మి.మీ
హవాయిలోని మరో ఐలాండ్ కవువాలో ఉన్న మౌంట్ వైయలేల్‌పై నిత్యం వర్షం పడుతూ.. పచ్చిక బయళ్ల అందాలు మనోహరంగా కనిపిస్తుంటాయి. ఏటా ఇక్కడ సగటున 9,763మి.మీ వర్షపాతం నమోదవుతుందట. ఈ పర్వతం శంఖం ఆకారంలో ఉండటం వల్లే వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1912లో ఇక్కడ అత్యధికంగా 17,348మి.మీ వర్షపాతం నమోదు కావడం ఒక రికార్డు.
కుకుయి - 9,293మి.మీ
హవాయిలోని మౌయి ఐలాండ్‌లో భాగమైన కుకుయి ప్రాంతం మౌనా కహలావా పర్వత శిఖారాగ్రంలో ఉంది. ఇక్కడ ఏటా సగటున 9,293మి.మీ వర్షపాతం నమోదవుతోంది.
ఇమేయ్ షాన్ - 8,169మి.మీ
చైనాలోని పవిత్ర పర్వతాల్లో ఒకటైన మౌంట్ ఇమేయ్ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు కురుస్తుంటాయి. రుతుపవనాలు వచ్చినప్పుడు సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ పర్వతం రెండు పొరలున్న మేఘాలను ఆకర్షిస్తుందని, అందుకే ఇక్కడ వర్షం బాగా కురుస్తుందని చైనావాసులు భావిస్తుంటారు. ఇమేయ్ పర్వతం వద్ద నమోదయ్యే వర్షపాతం సగటున 8,169మి.మీ ఉంటుంది.
Photo Credit: facebook pages, google map
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Crime News
Nizamabad: ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాల్పుల కలకలం