Mothers Health: గర్భిణిలు.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఆడవారికి అమ్మ అయ్యే క్షణాలు ఎంతో అపురూపం. నవమాసాలు కడుపులో మోసి, బిడ్డకుజన్మనిచ్చిన తరవాత ఆమె ఆనందానికి అవధులు ఉండవు.    

Published : 10 May 2022 00:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడవారికి అమ్మ అయ్యే క్షణాలు ఎంతో అపురూపం. నవమాసాలు కడుపులో మోసి, బిడ్డకు జన్మనిచ్చిన తరవాత ఆమె ఆనందానికి అవధులు ఉండవు. బిడ్డను చూడగానే ఆపరేషన్‌ చేసినపుడు అయిన గాయాలు, వచ్చే నొప్పులేవీ కనబడవు.  ఆ అమ్మదనంలోని కమ్మదనం అలా ఉంటుంది మరి! ప్రతి తల్లి తన బిడ్డ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ప్రసవానంతరం తల్లి శరీరంలో, ఆరోగ్య విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. 

* బరువు పెరిగిపోవడం

* బిడ్డకు తగినన్ని పాలు ఉత్పత్తి కాకపోవడం

* జుట్టు ఊడిపోవడం

కాన్పు అయిన తరవాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే  ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో సాధారణ ప్రసవాలు జరగటం లేదు. ఎక్కువగా ఆపరేషన్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు సాధారణ ప్రసవాలు జరిగేవి. తద్వారా తల్లిబిడ్డా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య అనిపించినా నేరుగా సిజేరియన్‌ చేస్తున్నారు. గర్భిణులు కూడా ఇదే సమయానికి బిడ్డ పుట్టాలని సిజేరియన్‌ చేయించుకుంటున్నారు.  ఒకప్పుడు 10 నుంచి 25 శాతం వరకు మాత్రమే సిజేరియన్స్‌ జరిగేవి. ప్రస్తుతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ఏ సమస్య లేకుండా సిజేరియన్‌ చేసే పరిస్థితి అన్ని కేసుల్లో ఉండకపోవచ్చు. అందుకే గర్భం ధరించిన తరవాత నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

అధిక బరువు: చాలా మంది మహిళలను బాధిస్తున్న సమస్య అధిక బరువు. అయితే ఈ బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. గర్భిణులు వారి కోసం, వారి బిడ్డ కోసం తినాల్సి ఉంటుంది. ఇదే కారణంతో చాలా మంది ఎక్కువ తినేస్తారు. కానీ ఎలాంటి పని, వ్యాయామం చేయకుండా  ఉన్నట్లయితే ప్రసవానతరం అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాన్పు సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒబెసిటీ అంటే ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం. ఇందులో కేటగిరీలు ఉంటాయి. మహిళ బీఎమ్‌ఐ తో పోల్చి చూస్తారు. (బాడీ మాస్‌ ఇండక్స్‌) ఇది సాధారణంగా ఐడిల్‌ వెయిట్‌ 18.5 నుంచి 24.9 వరకూ ఉంటుంది. 30 వరకూ ఉంటే కేటగిరీ 1 అని, 35 తరవాత ఉంటే కేటగిరీ 2, 40 ఉంటే కేటగిరీ 3గా పరిగణిస్తారు. అబ్‌నార్మాలిటీ కేసులు, మిస్ క్యారీ, బేబీ ముందుగా పుట్టడం లాంటి పరిస్థితులు తలెత్తవచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం. చాలా తక్కువగా ఉండటం. జుట్టు ఊడిపోవటం కాన్పు తరవాత బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లులకు జుట్టు రాలుతుంటుంది. ఇలా రాలకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు తెలుసుకుందాం! నిజానికి మన జుట్టు మూడు దశలో ఉంటాయి.

* పెరిగే దశ

* విశ్రాంత దశ 

* ఊడిపోయే దశ 
 ప్రసవానంతరం జుట్టు రాలడం సాధారణ విషయం. గర్భం ధరించిన సమయంలో  జుట్టు రాలినా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే  75 రోజుల తరవాత జుట్టు మళ్లీ పెరగటం మొదలవుతుంది. గర్భం ధరించినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రసవానంతరం కూడా తల్లులు ఆరోగ్య విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని