₹20వేల లోపు ధరలో మోటో కొత్త ఫోన్‌

మోటోరోలా నుంచి ఓ మిడ్‌రేంజ్‌ ఫోన్‌ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. మోటో జీ సిరీస్‌లో వచ్చే ఈ మొబైల్‌ రూ. 20 వేల లోపు ధరతో, మంచి ఫీచర్లతో ఆ ఫోన్‌ ఉండబోతుందని లీకులు

Updated : 16 Jul 2020 03:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటోరోలా నుంచి ఓ మిడ్‌రేంజ్‌ ఫోన్‌ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. మోటో జీ సిరీస్‌లో వచ్చే ఈ మొబైల్‌ రూ. 20 వేల లోపు ధరతో, మంచి ఫీచర్లతో ఉండబోతుందని లీకులు వచ్చాయి. ఇప్పుడు ఆ మొబైల్‌కు సంబంధిచిన ఫీచర్లు ఇవే అంటూ కొన్ని వివరాలు బయటికొచ్చాయి. త్వరలో మన దేశంలో ఈ మొబైల్‌ లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది.

మోటో జీ8 ప్లస్‌కు కొనసాగింపుగా మోటో జీ9 పేరుతో ఈ మొబైల్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. అలాగే ఇందులో 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ కూడా ఉంటుందట. ఈ మొబైల్‌ ప్రారంభ ధర 229 యూరోలు ఉంటుందని సమాచారం. అంటే మన ధరలో సుమారు రూ. 19 వేలు. అయితే ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా 5జీతో కాకుండా 4జీ నెట్‌వర్క్‌తోనే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

మోటో జీ8 ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను తీసుకొచ్చారు. కాబట్టి మోటో జీ9 ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్‌ 675 గానీ, స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌ గానీ ఉండొచ్చని తెలుస్తోంది. వెనుకవైపు గత మోడల్‌లాగే 48 ఎంపీ కెమెరా ఇస్తారట. దీంతోపాటు వైడ్‌ యాంగిల్, డెప్త్‌, మాక్రో కెమెరాలు ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ముందువైపు 25 ఎంపీ కెమెరా ఉండొచ్చని సమాచారం. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండే ఈ మొబైల్‌ 15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని