Anand Mahindra: ఇది చూస్తే ఎలాన్ మస్క్ ఆశ్చర్యపోవడం ఖాయం!
ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో.....
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ రహిత కార్లను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. అయితే ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో ఓ వ్యక్తి దర్జాగా కూర్చొని ఉండగా.. డ్రైవర్ లేకుండానే ఆ బండి రోడ్డుపై దూసుకుపోతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా షేర్ చేశారు. డ్రైవర్ రహిత వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఉన్న ఎలాన్ మస్క్‌కు ఇక్కడ పోటీ ఎదురుకాబోతోందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో కాస్తా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. సదరు వీడియోను ట్విటర్ వేదికా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 1972లో విడుదలైన బాలీవుడ్ దిగ్గజం కిశోర్ కుమార్ సినిమా ‘పరిచై’లోని ఓ పాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. డ్రైవర్ లేకుండా సాగే ప్రయాణం నాది.. అంటూ సాగే‘ముసాఫిర్ హూ యారో’ పాటలోని ఓ లిరిక్‌ను ఈ వీడియోకు జోడించారు. ‘డ్రైవర్ లేకండా సాగే ప్రయాణం నాది.. నాకు గమ్యం కూడా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.23 లక్షల మంది వీక్షించారు. పలువురు సరదా కామెంట్లు చేయగా.. ఇదో ప్రమాదకర స్టంట్ అని జాగ్రత్తలు వహించాలని మరికొందరు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?