Andhra news: పవన్‌ సమీక్షతో డయేరియా నివారణ చర్యలపై అధికారుల్లో కదలిక

డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది.

Published : 21 Jun 2024 20:54 IST

అమరావతి: డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 217 నీటి వనరులలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్లు వెల్లడించారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత నాలుగు నెలల కాలంలో గుంటూరు, విజయవాడ, కాకినాడ, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని చెప్పారు. అనేక మంది అనారోగ్యం పాలై ఆసుపత్రిల్లో చేరడంపై సీఎస్ ఆరా తీశారు. ఫిబ్రవరిలో ఓ వ్యక్తి డయేరియాతో చనిపోయారని అధికారులకు గుర్తు చేసిన సీఎస్‌... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని