Viveka Murder case: ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను 24గంటల్లోనే ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

Published : 29 Mar 2023 21:45 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. నిన్న దాఖలు చేసిన పిటిషన్‌ను 24 గంటలు తిరగకముందే ఎందుకు ఉపసంహరించుకున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ అవినాశ్‌ దాఖలు  చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే పలుసార్లు సీబీఐ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్యకేసు విచారణలో భాగంగా సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో పలుసార్లు సీబీఐ విచారణకు హాజరై దర్యాప్తునకు పూర్తిగా సహకరించినట్లు వివరిస్తూ.. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ ఇప్పుడు ఆ పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అనే అంశం ఆసక్తికరంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు