TS High court: భారాస ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసులో యథాతథస్థితి
భారాస ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో యథాతథస్థితి కొనసాగించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: భారాస ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో యథాతథస్థితి కొనసాగించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట బ్యాంకును మోసం చేశారన్న కేసులో ఈడీ అధికారులు నామా ఇంట్లో సోదాలు చేసి ప్రశ్నించడంతో పాటు పలు ఆస్తులను తాత్కాలిక జప్తు చేశారు. ఈడీ కేసు, ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ నామా నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నామా నాగేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో, ఛార్జిషీట్‌లో తన పేరు లేదని, మధుకాన్ గ్రూప్ సంస్థలకు తాను 2009లోనే నామా రాజీనామా చేసినట్టు తెలిపారు. వేధించడం కోసం దురుద్దేశ పూరితంగా ఈడీ కేసు పెట్టినట్టు తెలిపారు. నామా పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఈడీ గడువు కోరింది. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం కేసు విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?