Updated : 15 May 2021 14:14 IST

Raghurama:మీకు ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నారు?

సీఐడీ ప్ర‌శ్న‌లు

గుంటూరు: ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభియోగాల‌తో న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును సీఐడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయ‌న‌ను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. రాత్రి నుంచి ఆయ‌న సీఐడీ కార్యాల‌యంలోనే ఉన్నారు. అర్ధ‌రాత్రి వ‌ర‌కు అద‌న‌పు డీజీ సునీల్‌కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల స‌మాచారం, సాంకేతిక స‌హ‌కారం ఎవ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్న‌లు వేశారు. ఈ విష‌యాల్లో ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌ని అడిగారు.

సీఐడీ కార్యాల‌యంలోనే ఎంపీకి ఈ ఉద‌యం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీజీహెచ్ వైద్య బృందంలో ప‌రీక్ష‌ల‌ను చేయించారు. ఎంపీకి అవ‌స‌ర‌మైన మందులు, అల్పాహారాన్ని ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది సీఐడీ కార్యాల‌యంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు వాటిని ఎంపీకి అంద‌జేశారు. 

కొన‌సాగుతున్న సీఐడీ విచార‌ణ‌..

గుంటూరులోని ప్రాంతీయ కార్యాల‌యంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై సీఐడీ విచార‌ణ కొన‌సాగుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారంటూ ర‌ఘురామ‌రాజుపై రాజద్రోహం(124a) కేసు పెట్టిన సీఐడీ.. ఏ1గా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, ఏ2గా టీవీ 5 ఛాన‌ల్‌, ఏ3గా ఏబీఎన్ ఛాన‌ల్‌ల‌పై ఎఫ్ఐఆర్‌ న‌మోదు చేసింది. విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు ఎంపీని మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌వ‌ద్ద‌ని నిన్న రాత్రి హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని