MS Dhoni: ఎంఎస్ ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే ఆదివారం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.

Updated : 06 Jul 2024 14:53 IST

నందిగామ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే ఆదివారం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. నేషనల్‌ హైవే పక్కనే కావడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత ఏడాది 77 అడుగుల ఎత్తుతో పెట్టగా.. ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఇవాళ సాయంత్రం జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని ఫ్యాన్స్ అధ్యక్షుడు పగిడిపల్లి సిద్దు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని