MS Dhoni: విద్యుత్తు సంక్షోభంపై ప్రశ్నించిన ధోనీ భార్య..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి సింగ్‌ చేసిన ట్విట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

Updated : 26 Apr 2022 14:36 IST

దిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి సింగ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారుతోంది. ఝార్ఖండ్‌లో విద్యుత్తు సంక్షోభాన్ని ప్రశ్నిస్తూ.. ‘ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా అడుగుతున్నాను. ఝార్ఖండ్‌లో ఇన్ని సంవత్సరాల నుంచి విద్యుత్తు సంక్షోభం ఎందుకు ఉంది..? విద్యుత్తును ఆదా చేయడంలో మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాము’ అంటూ సాక్షి ట్విట్‌ చేశారు.

ఝార్ఖండ్‌లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ 28 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రాష్ట్రంలో బొగ్గు కొరత కారణంగా ఏర్పడ్డ విద్యుత్తు సంక్షోభం, పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని