
Updated : 03 Jan 2021 05:10 IST
నిండుప్రాణం నిలబెట్టిన కానిస్టేబుల్..!
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలో ఓ కానిస్టేబుల్ అప్రమత్తత నిండు ప్రాణాన్ని నిలబెట్టిన ఘటన దహిస్సర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఓ అరవై ఏళ్ల వ్యక్తి ఆ స్టేషన్‌లోని ట్రాక్‌పై ఉన్న సమయంలో సబర్బన్ రైలు రాకెట్లా దూసుకువచ్చింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి అతడికి సాయం చేశాడు. వేగంగా స్పందించి ఆ వ్యక్తిని ఫ్లాట్‌ఫామ్ పైకి లాగేశాడు. దాంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
Tags :