IPL 2021: ఆరంభమంతా దూకుడు.. ఆఖర్లో చేతులెత్తేసిన ముంబయి
ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్
అబుదాబి: ఆరంభంలో ఓపెనర్లు అదరగొట్టేశారు.. భారీ స్కోరు సాధించేస్తారేమో అన్నంతగా దూకుడుగా ఆడారు. అయితే మధ్య ఓవర్లలో ప్రత్యర్థి కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. ఐపీఎల్ 14వ సీజన్ రెండో ఎడిషన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు పరిస్థితి ఇదీ. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడిన ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్ (55) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ భారీ షాట్‌కు యత్నించి కోల్‌కతా బౌలర్ సునిల్ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యాడు. సూర్యకుమార్‌తోపాటు అప్పటి వరకు నిలకడగా ఆడిన డికాక్‌ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు చేర్చాడు. ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్య (12) ఆకట్టుకోలేకపోయారు. కీరన్ పొలార్డ్ (21) ఫర్వాలేదనిపించినా.. దూకుడుగా ఆడలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, సునిల్ నరైన్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు