Mumbai:రూబిక్స్‌ క్యూబ్‌లో ప్రపంచ రికార్డు బ్రేక్‌!

ముంబయికి చెందిన ఐమన్ కోలీ.. రూబిక్స్‌ క్యూబ్‌ పజిల్స్ పరిష్కరించడంలో ప్రతిభ చాటుతున్నాడు. కాళ్లతో 15.56 సెకన్లలో వ్యవధిలో 3×3×3 రూబిక్ క్యూబ్ పజిల్‌ను పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

Updated : 08 Dec 2022 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయికి చెందిన ఐమన్ కోలీ.. రూబిక్స్‌ క్యూబ్‌ పజిల్స్ పరిష్కరించడంలో ప్రతిభ చాటుతున్నాడు. కాళ్లతో 15.56 సెకన్లలో వ్యవధిలో 3×3×3 రూబిక్ క్యూబ్ పజిల్‌ను పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ కేటగిరిలో అంతకు ముందున్న16.96 సెకన్ల గిన్నిస్ వరల్డ్ రికార్డును ఐమన్‌ బ్రేక్ చేశాడు. చిన్నప్పటి నుంచి రూబిక్స్‌ క్యూబ్‌పై ఆసక్తి పెంచుకున్న అతడు పలు విధాలుగా దాన్ని అమర్చడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు విఫలమైన ఐమన్ పట్టు వదలకుండా శ్రమించి వరల్డ్ రికార్డు సాధించాడు. అటు ఐమన్ ప్రతిభ చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో గతంలో పోస్టు చేశారు. ఐమన్‌ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయానన్న సచిన్‌, క్యూబ్‌ వైపు చూడకుండానే క్షణాల్లో పజిల్‌ పూర్తి చేశాడని కొనియాడారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని