Garbage Tax: చెత్తపన్ను ప్రజలు కడుతుంటే.. మీడియాకు ఇబ్బందేంటి?: శ్రీలక్ష్మి

ప్రజలే స్వచ్ఛందంగా చెత్తపన్ను కడుతున్నారని, వాళ్లు ట్యాక్స్‌ చెల్లిస్తుంటే మీడియాకొచ్చిన ఇబ్బందేంటని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అన్నారు.

Updated : 05 Jun 2023 20:03 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న చెత్తపన్నుపై పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి స్పందించారు. చెత్తపన్నును ప్రజలే స్వచ్ఛందంగా కడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కడుతుంటే మీడియాకు ఇబ్బందేంటని  ప్రశ్నించారు? ‘‘ చెత్తపన్నును మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే ప్రతిపాదించాయి. చెత్తపన్నుకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. వ్యర్థాల నిర్వహణ సరిగా లేదన్న కారణంతో వివిధ రాష్ట్రాలకు ఎన్‌జీటీ రూ.2 వేల కోట్ల జరిమానా వేసింది. ఏపీ ఒక్కటే ఎన్‌జీటీ జరిమానా నుంచి తప్పించుకోగలిగింది. సంస్కరణలతోనే కేంద్రం ఏపీకి రూ.645 కోట్లు అదనంగా ఇచ్చింది.’’ అని శ్రీలక్ష్మి అన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని