Andhra News: పాఠశాల విద్యాశాఖ సలహాదారు పదవికి మురళి రాజీనామా

పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు ఎ.మురళి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు.

Updated : 30 Sep 2022 20:17 IST

అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు ఎ.మురళి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందంటూ సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.‘‘గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా పనిచేయడం గొప్ప అనుభూతి. సీఎం జగన్‌ పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా నాడు-నేడుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో నా స్వరాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకే నా సేవలు పూర్తిగా తెలంగాణలో అందించేందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది’’ అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు