CM Jagan: విజయవాడలో హజ్‌హౌస్‌కు భూమి కేటాయించండి: సీఎం జగన్‌ ఆదేశం

ముస్లిం మతపెద్దలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. దాదాపు 2 గంటలపాటు చర్చించారు.

Updated : 13 Mar 2023 21:34 IST

అమరావతి: విజయవాడ (Vijayawada)లో హజ్‌హౌస్‌(Hus house)కు భూమి కేటాయించాలని అధికారులను సీఎం జగన్‌ (CM Jagan) ఆదేశించారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల రక్షణ కోసం కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి అంజద్‌ బాషా నేతృత్వంలో ముస్లిం సంఘాల పెద్దలు సోమవారం జగన్‌ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 2 గంటలపాటు చర్చలు జరిపారు. అన్ని మతాల భూముల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఖాజీల పదవీకాలాన్ని 3 నుంచి 10 ఏళ్లకు పెంచాలని జగన్‌ ఆదేశించారు. సయ్యద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలిపారు. కర్నూలు ఉర్దూ వర్సిటీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. చట్టసభల్లో ముస్లిం మైనార్టీలకు రాజకీయ పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి అంజద్‌ బాషా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు