Antioxidants: ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈ యాంటీఆక్సిడెంట్లు ఆహారంలో చేర్చుకోండి...

మన శరీరం కూడ యాంటీఆక్సీడెంట్లును తయారు చేసుకుంటుంది. ఇది మనకు తెలుసు. కానీ అవి శరీరానికి తగినంతగా ఉండవు. అందువల్ల శరీరానికి వీటిని ఇవ్వాలి

Published : 29 Apr 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన శరీరం కూడ యాంటీఆక్సిడెంట్లును తయారు చేసుకుంటుంది. ఇది మనకు తెలుసు. కానీ అవి శరీరానికి తగినంతగా ఉండవు. అందువల్ల శరీరానికి వీటిని ఇవ్వాలి అనుకునే వారు ఈ చిట్కాలను పాటించక తప్పదు.  కానీ అసలు ఈ యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి...? ఎక్కడ ఉంటాయి...? ఎలా ఉత్పన్నమవుతాయి...? అనే సందేహాం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల్లో ఇవి పుష్కలంగా లభిస్తున్నాయంట..! మన రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని పొందడంలో ఒక అడుగు ముందుకెద్దాం.
మరి వాటి కోసం తెలుసుకుందాం పదండి...

ఇవే యాంటీఆక్సిడెంట్లు:

మన శరీరంలో ఉండే కణాలు నష్టపోయినప్పుడు వాటి స్థానంలో కొత్త కణాలు రావాడానికి తోడ్పడే సమ్మేళనాలే యాంటీఆక్సిడెంట్లు. బీటా కెరోటీన్‌, ఫైటోకెమికల్స్‌, విటమిన్‌ ఈ,సీ లాంటివాటిని యాంటీఆక్సిడెంట్లు అంటారు. ఇవి శరీరంలోని బాహ్య, అంతర్గతంగా కణాలను దెబ్బతీసే ఫ్రిరాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, సక్రమమైన మెదడు ప్రక్రియకు, వృద్ధాప్యంలో శరీరానికి మద్దతుగా సహాయపడతాయి. అయితే మన శరీరమే యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది. కానీ కణాంతర ప్రక్రియలో వీటి విడుదల మాత్రం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి మనం తీసుకునే కూరగాయలు, సుగంధ ద్రవ్యాల్లో పుష్కలంగా ఉంటాయి. రోజువారి ఆహారంలో అతి ముఖ్యమైన 5 యాంటీఆక్సీడెంట్లను చూద్దాం.

1.కర్కుమిన్: 

ఇది ఒక క్రియాశీలక పదార్ధం. మనం వినియోగించే పసుపులో అంతర్భాగంగా ఉంటుంది. ఇది కొవ్వులో కరిగే యాంటీఆక్సిడెంట్ మెదడుపైన అధిక ప్రభావం కలిగి ఉంటుంది. శక్తివంతమైన సమ్మేళనాలు జతగా ఉండటంతో దీనిని రోజువారి ఆహారంలో తీసుకుంటే గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.  అల్జీమర్స్‌ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే రోజువారి భోజనం తయారీలో ఒక చిటికెడు పసుపును జోడించండి.

2.పైపిరిన్‌:

మసాల దినుసులకే రాజుగా భావించే మిరియాలలో ఈ పైపిరిన్‌ లభిస్తుంది. పైపెరిన్ మండుతున్న రుచితో ఉంటుంది. శరీరంలోని కొన్ని పోషకాలను గ్రహించడంలో కణాలు పైపిరిన్‌ సహాయం తీసుకుంటాయి. దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. బరువు తగ్గడానికి మద్దతు ఇస్తుంది. ఇది వాడడం వల్ల మీ భోజనం రుచిని కూడా పెంచుతుంది. సూప్‌లు, సలాడ్‌లు, కూరల్లో దీనిని భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి. 

3.లైకోపీన్: 
ఇది మొక్కల్లో ఉండే శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్‌. టమోటాలు, పుచ్చకాయ, బీట్‌రూట్‌తో సహా ఎరుపు గులాబీ, పండ్లలో కనిపిస్తుంది. దీనిని రోజూ వినియోగించడం వల్ల పర్యావరణ టాక్సిన్స్, వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణతో పాటు, శరీరాన్ని సూర్యునినుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది.

4.అల్లిసిన్: 
ఇది వెల్లుల్లిలో భ్యమవుతోంది.. వెల్లుల్లిని నమిలినప్పుడు అందులో ఉండే అల్లిసిన్ , సల్ఫర్ సమ్మేళనాలు చాలా తక్కువ కేలరీలతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జలుబు, రోగనిరోధక శక్తిని పెంచడం, అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడం, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చర్మం, జుట్టును మృదువుగా ఉండటానికి దోహదం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 

5.రెస్వెరాట్రాల్:
ద్రాక్ష, బెర్రీల్లో ఈ యాంటీఆక్సిడెంట్‌ దొరుకుతుంది. అధిక రక్తపోటు స్థాయిలు తగ్గించడానికి , శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి రెస్వెరాట్రాల్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మిమ్మల్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడమే కాకుండా మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీల్లో ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని