Bariatric surgery: ఊబకాయానికి బేరియాట్రిక్ సర్జరీ.. లాభమా? నష్టమా?
అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయం ప్రారంభమైతే ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: అధిక బరువు(Obesity)ను దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయం ప్రారంభమైతే ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో పొట్టకు కుట్లు వేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ(bariatric surgery)ని చేయించుకోవాల్సిందిగా వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించి పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ తరహా సర్జరీలతో దుష్ఫలితాలు చాలా ఉంటాయని.. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తాయని చాలా మంది విశ్వసిస్తున్నారు. దీంతోపాటు ఎముకలు బలహీనపడతాయని, కీళ్లనొప్పుల సమస్య మొదలవుతుందని, త్వరగా వృద్ధాప్యం వస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ నమ్మకాల్లో నిజమెంత..?
స్థూలకాయం మోయలేని భారమైనా.. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే.. కొండలాంటి దేహాన్ని సైతం కత్తిలా నాజూగ్గా మార్చుకోవడం కష్టమేమీ కాదు. డైటింగ్, వ్యాయామంతో పని లేకుండా పొట్టకు కుట్టు వేయడం ద్వారా తినే ఆహార పరిమాణాన్ని తగ్గించి.. తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడే బేరియాట్రిక్ సర్జరీ (bariatric surgery) అందుబాటులోకి వచ్చింది. దీంతో స్థూలకాయానికి చాలా సులువుగానే చెక్ పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సర్జరీలపైన పలు అపనమ్మకాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సర్జరీలతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయని.. ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదముందన్న భయాందోళనలు చాలా మందిలో ఉన్నాయి.
వ్యాయామమే ప్రధానం
బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లతోపాటు వ్యాయామం చాలా ప్రధానమని ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీతో బరువును నియంత్రించొచ్చని ఆయన చెబుతున్నారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల దుష్ఫలితాలు రావడం చాలా అరుదుగా కనిపిస్తాయని, ప్రాణాపాయం కూడా చాలా తక్కువేనని అంటున్నారు. కేవలం స్వల్ప ఘటనల ఆధారంగా అపోహలు ప్రచారం కావడంతో ఎక్కువ మంది భయాందోళనలకు గురవుతున్నారని ఆయన వివరించారు. ఊబకాయంతో బాధపడుతున్నవారిని సాధారణస్థాయికి తీసుకురావడమే ఈ సర్జరీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విధానంతో ఓ వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్న బరువులో 25 నుంచి 35 శాతం తగ్గించొచ్చని వివరించారు. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేమని.. తద్వారా అవసరమైన ప్రోటీన్లు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్స్ శరీరానికి అందవేమోననే కొందరు భయపడుతున్నారని, అయితే అవన్నీ పూర్తిగా అవాస్తవమని నర్సయ్య గౌడ్ తెలిపారు.
నియంత్రణలోకి దీర్ఘకాలిక జబ్బులు
గుండె, మూత్ర పిండాల శస్త్రచికిత్సల లాంటిదే బేరియాట్రిక్ సర్జరీ(bariatric surgery) అని ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. అయితే ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి ఏ పరిస్థితుల్లో సర్జరీ కోసం వచ్చారనే అంశం చికిత్సలో చాలా కీలకమని ఆమె చెబుతున్నారు. ఊబకాయం ప్రభావంతో పలు అవయవాలు క్షీణించే దశలో ఉన్నవారికి మాత్రం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఊబకాయంతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు లాంటి పలు అవయవాలపై ప్రభావం పడుతోందని భావించినవారు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీతో షుగర్, కొలెస్ట్రాల్, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక జబ్బులు నియంత్రణలోకి వస్తాయని చెబుతున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడే మహిళలు బరువు తగ్గడంతో.. గర్భం ధరించే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. అవయవాల మార్పడి చేయాల్సి వచ్చినప్పుడు అధిక బరువు సమస్యగా మారుతుందని తెలిపారు. అయితే అనువజ్ఞులైన వైద్య నిపుణుల సలహా మేరకే ఇలాంటి సర్జరీలు చేయించుకోవాలని డాక్టర్ శ్రీలక్ష్మి చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
-
Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన