TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఏ-3 నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది

Updated : 01 Apr 2023 21:21 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఏ-3 నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని, చిన్నారుల బాగోగులు చూసుకునే వారు లేరని రేణుక పిటిషన్‌లో పేర్కొంది. పేపర్‌ లీకేజీతో తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని, కేవలం నేరాభియోగాలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

కేసు విచారణ దశలో ఉన్నందున రేణుకకు బెయిల్‌ ఇవ్వొద్దని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని తెలిపారు. దీంతో రేణుక బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యను కస్టడీ కోరుతూ సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని