Numaish: 25 నుంచి నుమాయిష్‌ పునఃప్రారంభం: ఎగ్జిబిషన్ సొసైటీ

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ఈ ఏడాది

Published : 15 Feb 2022 01:49 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్.. 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నుమాయిష్‌ను నిలిపివేయాలని ఎగ్జిబిషన్‌ సొసైటీకి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవటం, పరిస్థితులు అదుపులోకి రావటంతో ఈనెల 25 నుంచి నుమాయిష్‌ను తిరిగి నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు నిర్వహిస్తామని.. వారాంతాల్లో మరో అరగంట పొడిగించి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని ప్రకటించింది. ఎట్టకేలకు నుమాయిష్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఇటు హైదరాబాద్ నగరవాసులు, వస్త్ర వాణిజ్య వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని