Nanda Kumar: 40 రోజులు జైల్లో ఉన్నా.. ఏం జరుగుతుందో తెలియడం లేదు: నందకుమార్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 08 Dec 2022 13:26 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి వారిద్దరూ విడుదలయ్యారు. అయితే వేర్వేరు చిరునామాలతో రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారంటూ రామచంద్ర భారతిపై, నందకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవడంతో జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్‌ పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుల్లో వీరిద్దరినీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. 

నందకుమార్‌పై బంజారాహిల్స్‌ ఠాణాలోనే ఐదు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫోర్జరీ కేసు, రాజేంద్రనగర్‌ పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నాయి. గత నెల 24న మెదక్‌ జిల్లా గజవాడకు చెందిన బాలయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నందకుమార్‌ రూ.80లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని.. అడిగితే కులం పేరుతో దూషించారని బాలయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌ పీఎస్‌లో 2017లో నమోదైన చీటింగ్‌ కేసు, 2018లో అమీర్‌పేట ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నందకుమార్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్‌ నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. తాను 40 రోజులు జైల్లో ఉన్నానని.. ఏం జరుగుతుందో తెలియడం లేదని జైలు నుంచి విడుదలయ్యాక నందకుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడతానని ఆయన తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు