Pawan Kalyan: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
నటుడు నందమూరి తారకరత్న సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని తెలిసింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించారు. మిగత పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయని వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను నారా లోకేశ్ పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!