Nara Bhuvaneshwari: మంత్రిగా నారా లోకేశ్‌ బాధ్యతలు.. భువనేశ్వరి అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు.

Published : 24 Jun 2024 17:52 IST

అమరావతి: ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. అప్పగించిన బాధ్యతలను లోకేశ్‌ సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరిచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని, ప్రజాసేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్షమార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు  తెలిపారు.

ఏపీలో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని.. చంద్రబాబు నాయకత్వంలో ఆ పరిస్థితి మారిపోయిందంటూ మరో పోస్టు చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లేనన్నారు. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోమంత్రి అనిత, పోలీసు సిబ్బందికి ‘ఎక్స్‌’ వేదికగానే అభినందనలు తెలిపారు. మహిళల భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని