Nara Lokesh: ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్‌ స్టార్‌: లోకేశ్‌

తెదేపా అధినేత, తన తండ్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 20 Apr 2022 13:00 IST

అమరావతి: తెదేపా అధినేత, తన తండ్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టిన రోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. తెలుగువారికి చంద్రబాబు అంటే ఒక భరోసా. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారు. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. సొంత కుటుంబం కాకుండా.. తెలుగుజాతినే కుటుంబం చేసుకున్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్‌ స్టార్‌’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

పవన్‌ శుభాకాంక్షలు..

చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని పవన్‌ ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని