Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్‌

మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

Published : 16 Jun 2024 12:09 IST

అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి విన్నవించారు. 

గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కళాశాల నుంచి ఇప్పించాలని జగదీశ్‌ అనే విద్యార్థి  కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్యసాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. ఆయా సమస్యలను విన్న లోకేశ్‌.. పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని