Nara Lokesh: అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ క్రీడాకారిణి సత్తా.. మంత్రి లోకేశ్‌ ప్రశంసలు

విజయవాడకు చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌కు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

Updated : 19 Jun 2024 11:17 IST

అమరావతి: విజయవాడకు చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌కు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఆమె ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇన్ స్కేటింగ్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. జెస్సీరాజ్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన బాలిక ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతిభగల క్రీడాకారిణులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ, సహకారాలను అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు