Nara Lokesh: నారా లోకేశ్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్‌.. నేడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Updated : 18 May 2023 10:24 IST

నంద్యాల: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్‌.. నేడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ ఎంఆర్‌ఐ సెంటర్‌లో ఆయన కుడి భుజానికి స్కానింగ్‌ చేశారు.

కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా భారీ తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేశ్‌ కుడి భుజానికి గాయమైంది. ఫిజియో థెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. 50 రోజులుగా నొప్పితో బాధపడుతూనే ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో లోకేశ్‌ కుడి భుజానికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని